RRR, The Kashmir Files or Rocketry: The Nambi Effect maybe official entry to Oscars from India: ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ కు వెళ్లే సినిమాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. RRR, ది కాశ్మీర్ ఫైల్‌, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ వంటి సినిమాలు ఆస్కార్ కు నామినేట్ అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే అవి వచ్చే ఏడాది ఆస్కార్స్‌లో నామినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే అధికారిక ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభం కాకపోవడంతో అభిమానులు అప్పుడే అంత హైప్‌ పెట్టుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి “ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని అన్ని ఫిల్మ్ అసోసియేషన్‌లకు ఆహ్వానాలను పంపడంతో, ఎంట్రీలను ఆహ్వానించే ప్రక్రియ సెప్టెంబర్ నెల మొదట్లో ప్రారంభమవుతుంది. ఈ జ్యూరీ సెప్టెంబర్ 16 నుంచి సినిమాలను చూడడం ప్రారంభిస్తారు. సెప్టెంబర్ చివరి నాటికి అధికారిక ఎంట్రీలను ప్రకటిస్తారు. ఆ సినిమాలను అక్టోబర్‌లో ఆస్కార్‌స్ కి పంపుతామని ఎఫ్‌ఎఫ్‌ఐ సెక్రటరీ జనరల్ సుప్రాన్ సేన్ వెల్లడించారు. ఇక ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నితిన్ మాట్లాడుతూ మాకు ఒక స్థిరమైన ఎంపిక కమిటీ లేదని,  మేము ప్రతి సంవత్సరం కొత్త సభ్యులను చేర్చుకుంతున్నామని అన్నారు.


వారందరూ జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలని, ఈ అఫీషియల్ ఎంట్రీ సినిమాలను నిర్ణయించడానికి మేము చాలా సినిమాలను చూస్తామని, ఒకవేళ నిర్మాతలు ఆస్కార్ ఎంట్రీకి తగినట్టు ఉంటే, నేరుగా అకాడమీకి వారి ఎంట్రీలను పంపవచ్చని, మేము జనాదరణ పొందిన సినిమాలను మాత్రమే కాకుండా భారతదేశం అంతటా ఉన్న సినిమాలను కూడా చూస్తామని అన్నారు. ఇక ఇప్పటికే జ్యూరీని ఏర్పాటు చేసినప్పటికీ, సభ్యుల పేర్లను ఇంకా వెల్లడించలేదు. "ఒకసారి పేర్లు బయటికి వచ్చిన తర్వాత, జ్యూరీ సభ్యుల నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారని చాలా ఒత్తిడి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతానికి రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్, మాధవన్ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్, అలాగే వివేక్ అగ్నిహోత్రి ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలు నామినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 


Also Read: Anasuya Bharadwaj Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు దేవతలా మారిన అనసూయ "ఆంటీ’’


Also Read: Bandla Ganesh News Channel: న్యూస్ ఛానల్ పెట్టబోతున్న బండ్ల గణేష్?